Saturday, July 3, 2010

నరేంద్రనాథ్

గొర్రెపాటి నరేంద్రనాథ్.. ఇంకా ఉన్నాడు. పోయిన సంవత్సరం ఈరోజున చనిపోయినప్పటికీ, మిత్రులందరి హృదయాల్లో నరేన్ ఇంకా పదిలంగానే ఉన్నాడు.

రాజకీయాల్లో అరాచకీయాన్ని చూస్తున్నా, రక్షకుల అకృత్యాలను చూస్తున్నా, కులాల పేరిట జరిగే కొట్లాటల్ని చూస్తున్నా, చదువుల పేరిట తెస్తున్న దుర్మార్గపు చట్టాల్ని చూస్తున్నా, నేలను దోచుకునే దళారుల్ని- తిరుపతి వేంకటేశ్వరునికి వాళ్లిచ్చే కోట్ల రూపాయల తెల్లధనపు ముడుపుల్ని చూస్తున్నా, వినియోగదారీ సంస్కృతిలో కొట్టుకుపోతున్న యువతరాన్ని చూస్తున్నా, స్వలాభాపేక్షతో మునిగిపోయే ప్రజాసంస్థల్ని చూస్తున్నా, అప్పుల్లో‌ చిక్కుకుని అలమటించే రైతుల్ని చూస్తున్నా- ఆ వ్యథలో జనించే ప్రతి స్పందన లోనూ నరేన్ ప్రతిరూపం కదులుతున్నది ఇంకా.

స్వతంత్ర జీవితాన్ని ప్రేమించిన నరేన్ స్వతంత్రం లేనన్ని రోజులూ- ప్రతి రోజూ గుర్తుకొస్తూనే ఉంటాడు.

1 comment:

రవి said...

నారాయణ గారు,మీ ఈ మెయిల్ ఐడీ నాకు ఇవ్వగలరా? నా వేగు ravi.env@gmail.com. శంకరాభరణం బ్లాగులో నా పూరణలు చూసి ఉంటారు.