సంతోషంగా ఉందాం!!
గతించిన వసంతం మళ్ళీ రాదు.. కానీ రావలసిన వసంతం ఎలాగూ వచ్చేస్తుంది కదా!?
గత వసంతంలో మొదలు పెట్టిన ఈ కపిత్వానికి జీవితం కొద్దిగా కామాలు పెట్టింది. అయిదారు నెలల కామా తర్వాత, మళ్ళీ ఓసారి వసంతం మొదలైనట్లుంది.
అందరం సంతోషంగా ఉందాం.
పోయిన ఉగాదికి మేం మొదలుపెట్టిన కొత్తపల్లి పత్రిక ( http://kottapalli.in ), ఇప్పుడు మెల్లగా నడవటం మొదలు పెట్టింది, చాలా రచనల్నీ, నవ్వుల్నీ, సంతోషాల్నీ మోసుకుని. అనుకున్నట్లుగానే ఈ మాధ్యమంగా చాలామంది మిత్రులైనారు. వసంతం పోయి, గ్రీష్మం, ఆ పైన మిగిలిన ఋతువులన్నీ వచ్చాయి.. వాటి వాటి వాసనల్ని విరజిమ్మాయి. చూస్తూ చూస్తూండగానే మళ్ళీ చెట్లు చిగురించాయి, మళ్ళీ కోయిలలు కూయటం మొదలెట్టాయి.
మళ్ళీ వచ్చేసింది వసంతం.
అందరం సంతోషంగా ఉందాం!!!
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
బ్లాగుకు మంచిపేరును ఎన్నుకున్నారు.మాదికూడా అనంతపురంజిల్లానే తాడిపత్రి దగ్గర పల్లె నావృత్తి వ్యవసాయం.నా బ్లాగు లీలామోహనం http://vijayamohan59.blogspot.com చూసి మీ అభిప్రాయం తెలియచేయండి.
మీ కొత్తపల్లి పత్రిక బాగుంది, అభినందనలు.
మీరు వ్యాఖ్యలకి వర్డు వెరిఫికేషను తీసేస్తే బాగుంటుంది, కావాలంటే మోడరేషను పెట్టుకోండి.
Post a Comment