జనక మహారాజు ఒక ప్రక్కన రాజుగా విధులు నిర్వర్తిస్తూనే, మరో ప్రక్కన ఆత్మచింతనలో మునిగిఉండేవాడు. 'మనసు గురించిగానీ, బుద్ధి గురించి గానీ, ప్రవర్తన గురించిగానీ ఏమైనా సందేహాలుంటే జనకుడిని అడగాలీ అని చెప్పుకునేవాళ్ళు.
ఒకసారి గొప్ప పండితుడు ఒకయన జనకరాజుగారి దర్బారుకు విచ్చేశాడు. వచ్చీరాగానే, సమయాన్ని వృధా చేయకుండా, ఆయన "రాజా! మన దు:ఖాలన్నిటికీ కారణం మన మనస్సే గదా? కనుక, మనం ఈ మనసును వదిలించుకుంటే సరిపోతుంది. మరి మనస్సును వదిలించుకునే మార్గం ఏమిటి? ఊహల్నీ, ఆ ఊహల్లో కోరికల గూడునూ, భయాల్నీ, సృష్టించి అది మనల్ని ఇరికించుకుంటుంది. ఒకసారి ఆ వలయంలోచిక్కుబడ్డాక, సమయం గడిచేకొద్దీ మనంమరింతగా అందులోమునిగిపోతాం తప్ప, ఇక పైకి రాలేం. దయచేసి, ఈ మనస్సును ఎలా వదిలించుకోవాలో, ఎలా మనం సంతోషంగా ఉండచ్చో చెప్పండి" అన్నాడు.
జనకుడు శ్రద్ధగా విన్నాడు. చిరునవ్వు నవ్వాడు. పండితుడు ఇంకా చెబుతూ పోయాడు- మనిషిని మనసు ఎంతగా బంధిస్తున్నదో రకరకాలుగా వివరించి బాధ పడుతున్నాడు.
జనక మహారాజు నడుచుకుంటూ దగ్గర్లో ఉన్న ఒక పెద్ద మ్రాను దగ్గరకు వెళ్ళాడు. దాని చుట్టూ చేతులు వేసి దాన్ని తన కౌగిలిలో బంధించి పట్టుకున్నాడు. ఆపైన పండితుడితో అన్నాడు, అక్కడినుండే- "అయ్యా! ఈ చెట్టు నన్ను బంధించి వేసింది. ఇది నన్ను వదలగానే మీరడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలను" అని.
ఆ పండితుడు వయసులో చిన్నవాడు, తన పాండిత్యం చూసుకొని గర్వపడేవాడు. "అరే! ఏమిటి, ఈ మనిషి, 'కర్మయోగీ అని ఈయన గురించి ప్రపంచంలో అందరూ చెప్పుకుంటుంటారే, చాలా తెలివిగలవాడు అనుకొని గదా, నేనిక్కడికి వచ్చింది? కానీ ఇతను చేస్తున్నదేమిటి? తనే చెట్టును పట్టుకున్నాడన్న సంగతి ఇతనికి ఇంకా అర్థమే కాలేదా? చెట్టు ఇతన్ని పట్టుకోవటం ఏమిటి? చెట్టు పట్టుకోదుగదా?" అని, అతను జనకరాజుతో "రాజా! జడమైన ఈ చెట్టు, ఇంత తెలివైన ప్రాణివి, నిన్ను ఎలా బంధించగలదు? వాస్తవానికి, దాన్ని పట్తుకున్నది నువ్వే. నీ పట్టును కొంత సడలించావంటే, మరుక్షణంలో నీకు ఆ చెట్టునుండి స్వేచ్ఛ లభిస్తుంది. ఏదైనా సరే, చేసేందుకు అవసరమైన ఆత్మశక్తి నీకున్నది- కానీ ఆ చెట్టు స్వయంగా జడమైనది- శక్తిహీనమైనది" అన్నాడు.
జనకుడు ఆ యువ పండితుడిని అడిగాడు- " నిజంగానా? ఈ చెట్టు నన్ను నిజంగానే బంధించట్లేదా? నేను దీన్ని వదిలేస్తే ఇది నన్ను వదిలిపెడుతుందా? నిజంగా వదిలిపెడుతుందా?" అని.
యువకుడన్నాడు-" అయ్యో!అందులో సందేహమేముంది మహారాజా! సూర్యునివెలుతురులో పదార్థాలు ఎంత స్పష్టంగా కనబడతాయో, ఈ సంగతీ నాకు అంతే స్పష్టంగా కనబడుతున్నది. ఆ చెట్టును వదిలెయ్యండి చాలు- మరుక్షణం మీకు స్వేచ్ఛ లభిస్తుంది. వదిలి చూడండి గద! నిజం మన ముందుకొస్తుంది. వదిలెయ్యండి, దాన్ని! " అని
జనకుడు చెట్టును వదిలిపెట్టి పండితుడి దగ్గరకు వచ్చి అన్నాడు- "అదే విధంగా, ఓ పండితుడా, ఈ మనస్సు అనేది జీవంలేని ఒక జడ పదార్థం. మనం ఆత్మశక్తి గలవారం- స్వతంత్రులమైన ఆత్మలం మనం- జీవంలేని మనసుకు ప్రాణంపోసిం దానికి తెలివి తెప్పించేది మనమే. కాబట్టి, ఏంచేయాలో అదీ మన చేతుల్లోనే ఉన్నది. మనస్సుకు మనం నిరంతరంగా ఇస్తూ ఉన్న శక్తిని, ఇక దానికి ఇవ్వకుండా నిలుపుదల చేసినట్లైతేం ఇక దానికంటూ వేరేగా శక్తి ఉండదు. గుర్తించాలి- ఎన్నటికీ యజమానులం మనమే. మన పనిముట్టు మనస్సు. ఈ వాస్తవాన్ని గుర్తించిన క్షణంలోనే మనకు స్వేచ్ఛ లభిస్తుంది.
పండితుడి ప్రశ్నకు జవాబు దొరికింది. అతడు జనకుడికి నమస్కరించి వెనుతిరిగాడు.
(మూలం: పర్తాప్ అగర్వాల్.. స్టోరీస్ ఫర్ ఎ డాటర్)
Showing posts with label అనువాదాలు. Show all posts
Showing posts with label అనువాదాలు. Show all posts
Monday, December 28, 2009
Wednesday, December 23, 2009
గొడవలు ఎలా తగ్గుతాయి?
మూలం: కారెంస్ పేజ్, చికాగో ట్రిబ్యూన్,
కథనం: పర్తాప్ అగర్వాల్
2006 అక్టోబరు రెండున పెన్సిల్వేనియాలో ఒక ఆమిష్ తెగవారి పల్లెలో ఒక భయానక మారణకాండ జరిగింది. పాల వ్యానును నడిపే డ్రైవరొకడు, చేత తుపాకీ పట్టుకొని, ఊరికి దూరంగా ఉన్న బడిలోకి జొరబడ్డాడు. ఆ చిన్న బడిలో ఉన్నది ఒకే గది. లోనికి జొరబడ్డ ఆ దొంగ తుపాకీ చూపి బెదిరించి, తరగతి గదిలోని టీచరును, మగపిల్లలను అందరినీ బయటికి తరిమేశాడు.
ఆ పైన, మిగిలిన ఆడపిల్లలందరినీ వరసగా నిలబెట్టి చంపేసేందుకు పూనుకున్నాడు ఆ దుర్మార్గుడు. ఆ పిల్లల్లో పెద్దపాప వయసు కేవలం పదమూడేళ్లు. మిగిలిన పిల్లలకు రానున్న మృతిని కొంచెం సేపైనా అవతలికి నెట్టేందుకేమో, మరి, ఆ పాప తనని ముందు కాల్చమని వేడుకున్నది వాడిని. వాడామెను పాశవికంగా కాల్చి చంపాడు.
తరువాత ఆ పాప చెల్లి, పదకొండేళ్లది, ముందుకు వచ్చి తనని కాల్చమన్నది. దుండగుడు ఆమెను కాల్చాడు, కానీఆమె చివరికి ప్రాణాలతో బయట పడింది. ఆపైన వాడు మిగిలిన పిల్లలందరినీ కాల్చాడు. వాళ్లలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మిగిలినవారి ప్రాణాలు దక్కాయి. అందరినీ కాల్చాక దుండగుడు తనని తాను కాల్చుకుని చచ్చిపోయాడు.
పిల్లల తల్లిదండ్రులు, మొత్తం ఆమిష్ తెగవారందరూ ఈ సంఘటనతో చలించిపోయారు. కానీ ఈ దురాగతానికి వారి ప్రతిస్పందన మాత్రం అనూహ్యంగా ఉండింది. వాళ్ళనుకున్నారు- "మరణాలన్నీ దైవనిర్ణయాలే. ఈ పిల్లల మృతికి మేం దు:ఖిస్తున్నప్పటికీ ఆ దేవుని నిర్ణయాన్ని సవినయంగా స్వీకరిస్తున్నాం. వారిని చంపిన దుండగీడు కూడా చచ్చిపోయాడు. మాలాగే, అతని కుటుంబంకూడా దు:ఖిస్తూ ఉంటుంది. ఆ విధంగా , మేమందరం కూడా హింస వల్ల బాధకు గురైనవాళ్లమే."
అందువల్ల, ఈ దురాగతం జరిగిన కొన్ని రోజుల తరువాత, ఆమిష్ తెగవారు అనేక బండ్లతో ఊరేగింపుగా ఆ దుండగుడి ఇంటికి వెళ్ళి, అతని కుటుంబ సభ్యులకు ఆహార పదార్ధాలు, వగైరాలను ఇచ్చి, వారికి తమ సానుభూతిని తెలియజేశారు.
హింస పునరావృతం కాకుండా ఆపగల్గేది కేవలం క్షమ మాత్రమే.

Subscribe to:
Posts (Atom)